News March 24, 2024

జనసేన పెండింగ్ స్థానాలివే!

image

AP: టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 18 అసెంబ్లీ స్థానాలు ప్రకటించిన జనసేన మూడింటిని పెండింగ్‌లో ఉంచింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Similar News

News September 10, 2024

తిన్న వెంటనే ఈ పనులు చేస్తే ముప్పు తప్పదు!

image

భోజనం చేశాక కొన్ని పనులు చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత:
స్నానం చేయొద్దు. శరీరంలో ఉష్ణోగ్రత మార్పు అరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ నీరు తాగొద్దు. దీని వలన ఒంట్లో టాక్సిన్లు పెరుగుతాయి. కాఫీ, టీ తాగొద్దు. వీటిలోని కొన్ని ఆమ్లాలు, ఆహారంలోని బలాన్ని తీసుకోనివ్వకుండా అడ్డుపడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోవద్దు. డయాబెటిస్, ఊబకాయం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు.

News September 10, 2024

కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్

image

TG: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె స్ఫూర్తి అని చెప్పారు. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 10, 2024

మీ స్మార్ట్‌ఫోన్ రేడియేషన్ తెలుసుకోండిలా..!

image

మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ వెలువడుతుందన్న సంగతి తెలిసిందే. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. దీన్ని స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్(SAR) ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని ఫోన్ కొన్నప్పుడు ఇచ్చే యూజర్ మాన్యువల్ లేదా ఆ సంస్థ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. లేదంటే మీ ఫోన్లో *#07# డయల్ చేసినా ఆ వివరాల్ని తెలుసుకోవచ్చు.