News January 30, 2025
జనవరి 30: చరిత్రలో ఈ రోజు

1882: అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ జననం
1940: నటుడు, రచయిత మోహన్ మహర్షి జననం
1957: సినీ దర్శకుడు ప్రియదర్శన్ జననం
1948: భారత జాతి పిత మహాత్మా గాంధీ మరణం
2016: తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి మరణం
2016: భారత సైనిక దళాల మాజీ ఛీఫ్ జనరల్ కేవీ కృష్ణారావు మరణం
అమరవీరుల సంస్మరణ దినం
Similar News
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్: ఖర్గేకు సీఎం రేవంత్ ఆహ్వానం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానాలు అందజేస్తున్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. సమ్మిట్ ఇన్విటేషన్‌ను అందజేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వారు ఖర్గేతో చర్చించారు.
News December 3, 2025
‘ది రాజా సాబ్’ రన్ టైమ్ 3గంటలు ఉండనుందా?

రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ మారుతీ కాంబోలో వస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ రన్ టైమ్‌పై SMలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మూవీకి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడి టికెట్ బుకింగ్ యాప్స్‌లో రన్ టైమ్ 3.15 గంటలు ఉన్నట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. భారత్‌లోనూ దాదాపుగా ఇదే రన్ టైమ్ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది.
News December 2, 2025
DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్

రవాణా వాహనాలకు కేంద్రం ఫిట్నెస్ <<18321648>>ఛార్జీలు<<>> పెంచడంపై సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(SIMTA) కీలక నిర్ణయం తీసుకుంది. DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది. AP, TN, TG, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది.


