News January 30, 2025

జనవరి 30: చరిత్రలో ఈ రోజు

image

1882: అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ జననం
1940: నటుడు, రచయిత మోహన్ మహర్షి జననం
1957: సినీ దర్శకుడు ప్రియదర్శన్ జననం
1948: భారత జాతి పిత మహాత్మా గాంధీ మరణం
2016: తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి మరణం
2016: భారత సైనిక దళాల మాజీ ఛీఫ్ జనరల్ కేవీ కృష్ణారావు మరణం
అమరవీరుల సంస్మరణ దినం

Similar News

News February 9, 2025

GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

image

AP: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన వారి నుంచి వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2019 OCT 15 ముందు జరిగిన ఆక్రమణలకు సంబంధించే దరఖాస్తులు స్వీకరించనుండగా, లబ్ధిదారులు రుజువు పత్రాలు అందించాలి. మహిళల పేరుపై పట్టా, కన్వేయన్స్ డీడ్ అందించిన రెండేళ్ల తర్వాత ప్రభుత్వం యాజమాన్య హక్కులు ఇవ్వనుంది. 150 గజాల వరకు ఉచితంగా, ఆపై ఉంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

News February 9, 2025

పరగడుపున వీటిని తింటున్నారా?

image

పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఏమీ తినకుండా నిమ్మ, నారింజ, దానిమ్మ పండ్లు తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఉప్పు, కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు తింటే పొట్ట ఉబ్బరం, అజీర్తి కలుగుతాయి. తీపి పదార్థాలు, టీ, కాఫీ తీసుకుంటే ఎసిడిటీ వస్తుంది. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ తాగకూడదు. నిల్వ పచ్చళ్లు, చీజ్ తినకూడదు.

News February 9, 2025

రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ

image

APలో ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 10న హాజరు కాని వారికి 17వ తేదీన అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

error: Content is protected !!