News March 4, 2025
Japan Train: సెకన్ లేటుగా వచ్చినా ఊరుకోరు!

ఇండియాలో చాలా రైళ్లు రోజూ గంటల కొద్దీ ఆలస్యంగానే నడుస్తుంటాయి. అయితే జపాన్ రైల్వే దీనికి పూర్తి వ్యతిరేకం. అక్కడి రైళ్లు స్టేషన్కు చేరుకునే సమయంలో సెకండ్లను కూడా ఉంచుతారు. సమయపాలన కోసం టెక్నాలజీని వాడుతున్నారు. ఆటోమెటిక్ ట్రైన్ కంట్రోల్ సాంకేతికత రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. షెడ్యూల్ ప్రకారం నడిచేలా సహాయపడుతుంది. ఓసారి 35 సెకండ్లు లేటుగా వచ్చినందుకు రైల్వే అధికారులు క్షమాపణలు కూడా చెప్పారట.
Similar News
News November 27, 2025
వనపర్తిలో ఈనెల 29, 30 తేదీల్లో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు

వనపర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ నెల 29, 30 తేదీల్లో అండర్-19 రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. మురళీధర్ తెలిపారు. సిన్లిన్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన వారు జాతీయస్థాయికి ఎంపికవుతారని చెప్పారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.
News November 27, 2025
రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: చంద్రబాబు

AP: అమరావతిని రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని CM చంద్రబాబు తెలిపారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును పొడిగించే అంశంపై కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. ‘అమరావతి అభివృద్ధి చెందాలి. ఈ ఫలాలను ఇక్కడి రైతులే ముందు అందుకోవాలి. వారికి న్యాయం చేయడం నా బాధ్యత. రెండో విడత ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం’ అని రాజధాని రైతులతో మీటింగ్లో పేర్కొన్నారు.
News November 27, 2025
ఇక పీరియడ్ బ్లడ్తో క్యాన్సర్ గుర్తించొచ్చు!

దేశంలో ఏటా 77వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో చనిపోతున్నారు. దీనికి కారణం నొప్పిని కలిగించే PAP స్మియర్ వంటి పరీక్షలకు భయపడి మహిళలు చెక్ చేయించుకోకపోవడమే. ఈ నేపథ్యంలో అసౌకర్యాన్ని, అధిక ఖర్చును దృష్టిలో ఉంచుకుని వైభవ్ శితోలే బృందం ‘M-STRIP’ అనే స్వీయ పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేసింది. పీరియడ్ బ్లడ్తో పరీక్ష చేసుకుంటే ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించి కాపాడుకోవచ్చని చెబుతున్నారు.


