News March 4, 2025
Japan Train: సెకన్ లేటుగా వచ్చినా ఊరుకోరు!

ఇండియాలో చాలా రైళ్లు రోజూ గంటల కొద్దీ ఆలస్యంగానే నడుస్తుంటాయి. అయితే జపాన్ రైల్వే దీనికి పూర్తి వ్యతిరేకం. అక్కడి రైళ్లు స్టేషన్‌కు చేరుకునే సమయంలో సెకండ్లను కూడా ఉంచుతారు. సమయపాలన కోసం టెక్నాలజీని వాడుతున్నారు. ఆటోమెటిక్ ట్రైన్ కంట్రోల్ సాంకేతికత రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. షెడ్యూల్ ప్రకారం నడిచేలా సహాయపడుతుంది. ఓసారి 35 సెకండ్లు లేటుగా వచ్చినందుకు రైల్వే అధికారులు క్షమాపణలు కూడా చెప్పారట.
Similar News
News March 22, 2025
IPL-2025: డూడుల్ మార్చిన గూగుల్

అతిపెద్ద ఫ్రాంచైజ్ క్రికెట్ పండుగ IPL ఈ రోజు ప్రారంభం కానుండటంతో ‘గూగుల్’ ప్రత్యేక డూడుల్‌ని ఆవిష్కరించింది. డూడుల్‌ను క్రికెట్ పిచ్‌గా మార్చేసి, రెండు డక్స్ ఆడుతున్నట్లు చూపించింది. కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు KKR, RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ జట్ల మధ్య ఇప్పటివరకు 34 మ్యాచులు జరగ్గా KKR 20, RCB 14 మ్యాచ్‌లు గెలిచాయి. నేటి మ్యాచ్‌లో గెలుపెవరిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News March 22, 2025
ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

డీలిమిటేషన్‌పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం మాన్ తదితరులు హాజరయ్యారు. వారిని స్టాలిన్ సత్కరించారు. సమావేశానికి బెంగాల్ సీఎం మమత గైర్హాజరయ్యారు.
News March 22, 2025
రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. UPDATE

TG: పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వేదిక ఖరారైంది. ఉగాది రోజున సూర్యాపేటలోని మట్టపల్లి ఆలయం నుంచి ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు 6కేజీల చొప్పున సన్నబియ్యం అందుకోనున్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనున్నారు.