News February 15, 2025

జయలలిత బంగారు ‘ఖజానా’!

image

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News March 28, 2025

కలెక్షన్లలో ‘L2: ఎంపురాన్’ రికార్డు

image

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘L2: ఎంపురాన్’ దేశవ్యాప్తంగా తొలి రోజు ₹21కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇంతకముందు ఈ రికార్డు పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ (₹8.95cr) పేరిట ఉండేది. ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. మీరు ఈ మూవీ చూశారా? ఎలా ఉంది?

News March 28, 2025

చార్‌ధామ్ యాత్ర.. వీడియోలు, రీల్స్ చిత్రీకరణపై నిషేధం

image

ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర సందర్భంగా ఆలయాల ప్రాంగణంలో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిషేధం ఉండనుంది. ఆలయ ప్రాంగణంలో వీడియోలు, రీల్స్ చేస్తూ ఎవరైనా దొరికితే వారికి దర్శనం నిరాకరించి తిరిగి పంపించేస్తామని కేదార్‌నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ప్రకటించింది. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి తలుపులు, మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.

News March 28, 2025

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పెద్దవాడు: అంబటి

image

AP: అబద్ధాలు చెప్పడంలో CM చంద్రబాబు అందరికంటే పెద్దవారని, నిజాలు చెప్పడంలో చిన్న వారని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే. ప్రాజెక్టు నిధులను జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది నిజమని నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును మేమే కడతామని CBN ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.

error: Content is protected !!