News October 7, 2024
శ్రీలంక హెడ్ కోచ్‌గా జయసూర్య

శ్రీలంక క్రికెట్ టీమ్ హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య నియమితులయ్యారు. గత కొంతకాలంగా ఆయన తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తుండగా, జట్టు మంచి ఫలితాలను రాబట్టింది. IND, NZ, ENGలపై అద్భుతంగా రాణించింది. ఈ నేపథ్యంలో 2026, మార్చి 31 వరకు ఆయన హెడ్ కోచ్‌గా కొనసాగుతారని పేర్కొంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.
Similar News
News December 11, 2025
యాషెస్ మూడో టెస్టుకు కమిన్స్

ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యాషెస్ సిరీస్ 3వ టెస్టుకు అందుబాటులోకి వచ్చారు. జులైలో WIతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వెన్నునొప్పికి గురైన అతను ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. స్పిన్నర్ నాథన్ లయన్ కూడా ఈ టెస్టులో బరిలో దిగే ఛాన్సుంది. కమిన్స్ గైర్హాజరుతో తొలి 2 టెస్టులకు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించగా, రెండిట్లోనూ ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ నెల 17న అడిలైడ్‌లో మూడో టెస్ట్ జరగనుంది.
News December 11, 2025
రాష్ట్రంలో 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

<
News December 11, 2025
ఆలయ ప్రవేశం.. ఆరోగ్య కారకం!

గుడికి వెళ్లినప్పుడు చెప్పులను బయటే వదిలేస్తాం. దీనివల్ల ప్రతికూల శక్తి ఆలయంలోకి ప్రవేశించదు. దేవాలయ ప్రాంగణంలో ఒట్టి కాళ్లతో నడవడం వల్ల నేలలోని పాజిటివ్ ఎనర్జీ పాదాల ద్వారా శరీరమంతా వ్యాపించి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే దేవతా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అందులో కూడా శక్తిమంతమైన అయస్కాంత శక్తి నిలుస్తుంది. దైవ దర్శనంతో ఆ శక్తి మనలోకి ప్రవేశించి, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.


