News November 8, 2024
US ఉపాధ్యక్షుడిగా JD వాన్స్ విచిత్ర రికార్డు
US అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు అత్యంత సన్నిహితుడైన <<13637824>>JD వాన్స్<<>> ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ శతాబ్దంలో ఆయన గడ్డం ఉన్న తొలి ఉపాధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 1933లో మీసాలతో ఉన్న చార్లెస్ కర్టిస్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. చార్లెస్ ఫెయిర్ బ్యాంక్స్ గడ్డం ఉన్న చివరి వైస్‌ప్రెసిడెంట్(1905-09)గా నిలిచారు.
Similar News
News November 8, 2024
మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తాం: జగన్
AP: 40% ఓట్లు వచ్చిన YCPని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని YS జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో అధికార కూటమి, మరొక పక్షం YCP మాత్రమే ఉందని, అలాంటి తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే తప్పులు, ప్రజా సమస్యలు వినిపిస్తామనే భయంతోనే ఆ గుర్తింపు ఇవ్వట్లేదని ఆరోపించారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు మీడియా ద్వారా ప్రతిరోజూ ప్రతిపక్షంగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటామన్నారు.
News November 8, 2024
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ రిటైర్మెంట్
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆయనకు చివరి సిరీస్ అని ప్రకటించింది. కాగా 2009లో అఫ్గాన్ ఆడిన తొలి వన్డేలో నబీ సభ్యుడు. ఇప్పటివరకు ఆయన 165 వన్డేలు ఆడారు. 3,549 పరుగులతోపాటు 171 వికెట్లు కూడా పడగొట్టారు. 2019లోనే నబీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇకపై ఆయన టీ20ల్లోనే కొనసాగుతారు.
News November 8, 2024
నిస్సాన్‌లో 9,000 మందికి లేఆఫ్స్
జపాన్‌లో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘నిస్సాన్’ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో యూరప్‌లోనే 4,700 జాబ్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కార్ల ఉత్పత్తిని 20% తగ్గిస్తామని తెలిపింది. నిస్సాన్ వార్షికాదాయ అంచనాను 70 శాతం($975 మిలియన్) కుదించింది. తాము తీసుకునే చర్యలతో మళ్లీ పుంజుకుంటామని CEO మకోటో ఉచిద ధీమా వ్యక్తం చేశారు.