News November 8, 2024

US ఉపాధ్యక్షుడిగా JD వాన్స్ విచిత్ర రికార్డు

image

US అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు అత్యంత సన్నిహితుడైన <<13637824>>JD వాన్స్<<>> ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ శతాబ్దంలో ఆయన గడ్డం ఉన్న తొలి ఉపాధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 1933లో మీసాలతో ఉన్న చార్లెస్ కర్టిస్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. చార్లెస్ ఫెయిర్ బ్యాంక్స్ గడ్డం ఉన్న చివరి వైస్‌ప్రెసిడెంట్‌(1905-09)గా నిలిచారు.

Similar News

News December 8, 2024

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. TGలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 10 నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ తదితర జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి.

News December 8, 2024

ఏప్రిల్ నుంచి రాజమౌళి-మహేశ్ సినిమా షురూ?

image

రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం లొకేషన్లు, నటీనటుల ఎంపికలో దర్శకధీరుడు బిజీగా ఉన్నారు. ఏప్రిల్ మూడో వారం తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

News December 8, 2024

AUSvsIND: టీమ్ ఇండియా అమ్మాయిల లక్ష్యం 372

image

ఆస్ట్రేలియాలో భారత్, ఆసీస్ అమ్మాయిల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా బౌలర్లు తేలిపోయారు. జార్జియా వోల్(101), ఎలీస్ పెర్రీ(105) సెంచరీలు, లిచ్‌ఫీల్డ్(60), బెత్ మూనీ(56) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 50 ఓవర్లలో ఆసీస్ టీమ్ 371/8 స్కోర్ చేసింది. భారత బౌలర్లలో సైమా 3 వికెట్లు, మిన్ను 2, రేణుక, దీప్తి శర్మ, ప్రియా మిశ్రా తలో వికెట్ తీశారు.