News April 3, 2024

రేపటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు

image

JEE మెయిన్ సెషన్-2 పరీక్షలు రేపటి నుంచి ఈనెల 12 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, 291 నగరాల్లో 544 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు రాయనున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి షిఫ్ట్, మ.3 నుంచి సా.6 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Similar News

News November 8, 2024

తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా?: హరీశ్

image

TG: కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా? రేవంత్ సీఎం అయ్యేవాడా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. KCR ఆనవాళ్లు లేకుండా మూసీ శుద్ధి చేయడం సాధ్యం కాదని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఒక్క ఇళ్లు కట్టలేదని దుయ్యబట్టారు. కూలగొట్టడం తప్ప నిర్మించడం రేవంత్‌కు తెలియదని మండిపడ్డారు. సీఎం బెదిరింపులకు భయపడమని, ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.

News November 8, 2024

సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టవద్దు: ఏపీ పోలీస్

image

సోషల్ మీడియాలో కుల, మత వర్గాల మధ్య విబేధాలకు దారితీసే పోస్టులు పెట్టవద్దని విజయవాడ పోలీసులు ఓ ప్రకటనలో సూచించారు. మార్ఫింగ్, ట్రోలింగ్, అశ్లీల, హింసాత్మక ఫొటోలు/వీడియోలు, తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయవద్దని పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్స్‌తో అసభ్యకర పోస్టులు, మెసేజులు చేయడం, ఆన్‌లైన్ వేధింపులు, చట్టవిరుద్ధ కార్యాకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఫిర్యాదులకు 112కు కాల్ చేయాలన్నారు.

News November 8, 2024

‘యోగా’ టెక్నిక్ ఆమె ప్రాణాలను కాపాడింది

image

బెంగళూరులో యోగా టీచర్ అర్చన(35) బ్రీత్ కంట్రోల్ ప్రతిభతో చావు నుంచి తప్పించుకుంది. ఆమెకు తన భర్తతో అక్రమ సంబంధం ఉందని బిందు అనే మహిళ అనుమానించింది. అర్చనను చంపేందుకు కొందరికి సుపారీ ఇచ్చింది. వారు ఆమెను తీవ్రంగా కొట్టి అడవికి తీసుకెళ్లారు. అర్చన తన యోగా ప్రతిభతో శ్వాసను నియంత్రించుకుని చనిపోయినట్లు నటించడంతో దుండగులు వదిలేసి వెళ్లిపోయారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్టు చేశారు.