News April 10, 2024

25న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు

image

జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల ఫలితాలు ఈనెల 25న విడుదల కానున్నాయి. మెయిన్ సెషన్-2 పేపర్-1 పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈనెల 12న పేపర్-2(ఎ), పేపర్-2(బి) పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత NTA రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించనుంది.

Similar News

News March 17, 2025

భాషపై లేనిపోని రాజకీయాలు చేయం: CBN

image

AP: భాష కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం రాదని CM చంద్రబాబు అన్నారు. ‘మాతృభాషతోనే విజ్ఞానం వస్తుంది. భాషపై లేనిపోని రాజకీయాలు చేయం. బతుకుదెరువుకు ఎన్ని భాషలైనా నేర్చుకుంటాం. కానీ మాతృభాషను మరిచిపోకూడదు’ అని తెలిపారు. మరోవైపు, ధ్వంసమైన రాష్ట్రాన్ని ట్రాక్‌లో పెట్టామన్నారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడం ఖాయమని వివరించారు.

News March 17, 2025

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయను: హర్ష సాయి

image

ఇకపై బెట్టింగ్ యాప్స్‌ను తాను ప్రమోట్ చేయనని ప్రముఖ యూట్యూబర్ <<15777784>>హర్షసాయి<<>> అన్నారు. బెట్టింగ్ మూలాలపై అందరం కలిసి పోరాడదామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందెన్నడూ తాను చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయలేదని తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా వీసీ సజ్జనార్ సూచనల మేరకు హర్షసాయిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

News March 17, 2025

రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: KTR

image

TG: ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ ఒప్పుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో అంతా బానే ఉందని కాంగ్రెస్ నమ్మించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పెట్టుబడులు, వ్యవసాయ రంగ వృద్ధి, సంపద, సీఎం పనితీరు మెరుగ్గా ఉందని చెబుతోందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు, విధానాల ఫలితమే ఈ ప్రతికూల వృద్ధి అని పేర్కొన్నారు.

error: Content is protected !!