News August 30, 2024
విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన జెత్వానీ

AP: ముంబై నటి కాదంబరి జెత్వానీ విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన కేసు, అంతకుముందు పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై తాను ముంబైలో పెట్టిన కేసుపై వివరాలు ఇచ్చారు. మరోవైపు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రముఖ పత్రికతో పాటు టీడీపీ నేత వర్ల రామయ్యపై పరువు నష్టం దావా వేశారు. వారికి లీగల్ నోటీసులు పంపారు.
Similar News
News July 9, 2025
‘శబరి’ రైలు ఇక సూపర్‌ఫాస్ట్

సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ రైలు మ.2.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతి రోజు సా.6.20కు తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉ.6.45కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.11 గంటలకే సికింద్రాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై త్వరలోనే అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.
News July 9, 2025
గోల్డెన్ వీసాపై రూమర్లు నమ్మొద్దు: UAE

తాము ప్రవేశపెట్టబోయే <<16986034>>గోల్డెన్ వీసాపై<<>> వస్తున్న రూమర్లను ఎవరూ నమ్మొద్దని UAE తెలిపింది. దీనిపై ఎలాంటి థర్డ్ పార్టీ సంస్థకు హక్కులు ఇవ్వలేదని, తమ దేశ అధికారిక సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మధ్యవర్తులను సంప్రదించవద్దని కోరింది. ఈ విషయంలో ఎవరైనా మోసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరిన్ని వివరాలకు 600522222ను సంప్రదించాలని సూచించింది.
News July 9, 2025
ఇవాళ భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి లిస్ట్ కోసం <