News November 16, 2024
ఝాన్సీ ఆస్పత్రి ప్రమాదం: నర్స్ అగ్గిపెట్టె వెలిగించడం వల్లనే?

యూపీలోని ఝాన్సీ ఆస్పత్రిలో ఓ నర్సు అగ్గిపెట్టె వెలిగించడం వల్లనే <<14624059>>అగ్ని ప్రమాదం జరిగిందని<<>> భగవాన్ దాస్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ‘ఆ సమయానికి నేను వార్డులోనే ఉన్నాను. ఆక్సిజన్ సిలిండర్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ఓ నర్సు అగ్గిపెట్టెను వెలిగించారు. దీంతో వెంటనే నిప్పు అంటుకుంది. నలుగురు పిల్లల్ని గుడ్డలో చుట్టి బయటికి తీసుకొచ్చేశాను. తర్వాత ఇతరుల సాయంతో మరింతమందిని కాపాడగలిగాం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
TU: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ప్రిన్సిపల్

భిక్కనూర్ పరిధిలోని TU సౌత్ క్యాంపస్‌లో విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. అధ్యాపకులతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటం చట్టరీత్యా నేరమన్నారు. వర్సిటీ నియమ నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందన్నారు. ఈ సమావేశంలో వార్డెన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
News March 7, 2026
నాలుగుసార్లు ప్రధాని.. చిత్తుగా ఓడిపోయారు

నేపాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఆ దేశానికి నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ(CPN-UML) సొంత నియోజకవర్గం జాఫా-5లో చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై RSP అభ్యర్థి బాలేంద్ర షా 49,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఓవరాల్‌గా 165 స్థానాలకుగాను RSP 67 చోట్ల గెలిచింది. 55 సెగ్మెంట్లలో లీడింగ్‌లో ఉంది. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్‌తో పోటీ పడుతున్నాయి.
News March 7, 2026
ఇకపై రైతుల అకౌంట్లకే సబ్సిడీ నిధులు: తుమ్మల

TG: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులు కొనుగోలు చేసిన పనిముట్లకు 40% సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తోంది. ఇకపై అన్నదాతల ఖాతాలకే ఆ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. APR నెలాఖరులోగా పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఖరీఫ్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించాలన్నారు. ఈసారి 60.60L హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.


