News November 20, 2024
ఝార్ఖండ్ EXIT POLLS: బీజేపీకి పట్టం
ఝార్ఖండ్లో అధికారం మారుతుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. బీజేపీ కూటమికి 42-47, కాంగ్రెస్ కూటమికి 25-30, ఇతరులకు 1-4 సీట్లు వస్తాయని తెలిపింది. హేమంత్ సోరెన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని తెలుస్తోంది.
Similar News
News November 27, 2024
మరో వినోద్ కాంబ్లీలా మారిన పృథ్వీషా?
టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా మరో వినోద్ కాంబ్లీలా మారిపోయారు. నెక్ట్స్ సచిన్ అని అందరూ అనుకుంటుండగానే పాతాళానికి పడిపోయారు. దేశవాళీ, భారత జట్టులో చోటు కోల్పోవడం, నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుండటంతో ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి చూపలేదు. ఆయనపై కనీసం రూ.75 లక్షలు వెచ్చించేందుకు కూడా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. క్రమశిక్షణ లేకపోవడంతో అప్పట్లో భారత మాజీ క్రికెటర్ కాంబ్లీకి కూడా ఇదే గతి పట్టింది.
News November 27, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: నవంబర్ 27, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5:11 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:28 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.56 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2024
నేషనల్ హైవేపై ఆందోళన విరమించిన రైతులు
TG: నిర్మల్(D) దిలావర్పూర్లో నేషనల్ హైవేపై స్థానిక రైతులు ఆందోళన విరమించారు. కాగా స్థానికంగా ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్పై సీఎం కార్యాలయానికి నివేదిక పంపినట్లుగా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి నచ్చజెప్పేందుకు వెళ్లిన ఆర్డీవో రత్నకళ్యాణిని చుట్టుముట్టగా ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.