News November 20, 2024

ఝార్ఖండ్ EXIT POLLS: బీజేపీకి పట్టం

image

ఝార్ఖండ్‌లో అధికారం మారుతుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. బీజేపీ కూటమికి 42-47, కాంగ్రెస్ కూటమికి 25-30, ఇతరులకు 1-4 సీట్లు వస్తాయని తెలిపింది. హేమంత్ సోరెన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని తెలుస్తోంది.

Similar News

News April 18, 2026

పవన్ కళ్యాణ్‌కు సర్జరీ

image

AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇవాళ సర్జరీ జరిగింది. నిన్న ఓ సమావేశంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం, కొన్ని నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుండటంతో ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తిగా హెల్తీగా మారేందుకు ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు.

News April 18, 2026

పెద్దలు కుదిర్చే పెళ్లికి సిద్ధమైన శ్రుతి హాసన్‌?

image

హీరోయిన్ శ్రుతి హాసన్ పెద్దలు కుదిర్చే పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వరుడిని వెతికే పనిలో తండ్రి కమల్ బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూసినా వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. వీలైనంత త్వరగా మ్యారేజ్ చేయాలని ఆయన భావిస్తున్నారట. కాగా గతంలో లండన్ బేస్డ్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలే, విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ఆమెకు బ్రేకప్ జరిగిన విషయం తెలిసిందే.

News April 18, 2026

నా బాధను పంచుకోవడానికి వచ్చా: మోదీ

image

మహిళా బిల్లు వీగిన తర్వాత తొలిసారిగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్, డీఎంకేలపై విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ల కోసం బిల్లు పెడితే ఆ పార్టీలు అడ్డుకున్నాయని తెలిపారు. తన బాధను పంచుకోవడానికి ఇక్కడికి వచ్చానని.. రిజర్వేషన్ల కోసం తాము చేసే పోరాటం ఇంకా ముగియలేదని పేర్కొన్నారు. డీఎంకే నేతల చీకటి పనులు ప్రజలకు తెలుసని విమర్శించారు.