News November 29, 2024
SMATలో ఝార్ఖండ్ సంచలనం

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ(SMAT)లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఝార్ఖండ్ విధ్వంసం సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్ 20 ఓవర్లకు 93 పరుగులు చేయగా 4.3 ఓవర్లలోనే ఝార్ఖండ్ 94 రన్స్ను ఛేజ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ 23 బంతుల్లోనే 77 పరుగులు చేయడం విశేషం. వచ్చే ఏడాది ఐపీఎల్లో ఇషాన్ కిషన్ హైదరాబాద్ జట్టుకు ఆడనున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 10, 2025
సఫారీలపై మన రికార్డు పేలవమే..

ఈ నెల 14 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత రికార్డులు టీమ్ ఇండియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 సిరీస్లు జరగగా 8 సార్లు సఫారీలదే విజయం. ఇండియా 4 సార్లు గెలవగా, మరో నాలుగు సిరీస్లు డ్రాగా ముగిశాయి. చివరిగా ఆడిన సిరీస్ డ్రాగా ముగియడం భారత్కు ఊరటనిస్తోంది. కాగా WTC డిఫెండింగ్ ఛాంపియన్ను గిల్ సేన ఓడించాలంటే అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది.
News November 10, 2025
బహు భార్యత్వ నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడుతామని CM హిమంత బిస్వ శర్మ తెలిపారు. దీనిని ఉల్లంఘించి రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఎస్టీలకు తప్పా అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో 6వ షెడ్యూల్ వర్తించే ప్రాంతాలకు ప్రస్తుతం ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.
News November 10, 2025
నవంబర్ 10: చరిత్రలో ఈరోజు

1798: తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జననం
1848: జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ జననం
1904: బహురూపధారణ(డ్యుయల్ రోల్) ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు వైద్యుల చంద్రశేఖరం జననం
1979: స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత తెన్నేటి విశ్వనాథం మరణం (ఫొటోలో)
1993: కథా రచయిత రావిశాస్త్రి మరణం
* ప్రపంచ సైన్స్ దినోత్సవం


