News May 10, 2024

ఝార్ఖండ్ మాజీ సీఎంకు సుప్రీంలో చుక్కెదురు

image

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈ ఏడాది జనవరిలో ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. రాంచీలోని జైల్లో ఉన్న సోరెన్, లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ను అనుమతించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. వచ్చే సోమవారం మనీలాండరింగ్ కేసు విచారణ సమయంలో బెయిల్ పిటిషన్ ప్రస్తావించాలని సూచిస్తూ ధర్మాసనం ప్రస్తుత పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Similar News

News April 16, 2026

ముంబై బ్యాటింగ్.. రోహిత్ శర్మ దూరం

image

ముంబైతో మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచుకు దూరం అయ్యారు. డికాక్ జట్టులోకి వచ్చారు.
ముంబై: డికాక్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్ ధీర్, హార్దిక్ (C), రూథర్‌ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మయాంక్ రావత్, బుమ్రా.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్.

News April 16, 2026

బెంగాల్ ‘మాజీ ఓటర్ల’కు రిలీఫ్?

image

బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ SIRతో ఓట్లు కోల్పోయిన వారికి ఊరట లభించే అవకాశం ఉంది. ఎన్నికల జాబితాలో పేరు చేర్చేందుకు అప్పీలేట్ ట్రైబ్యునల్స్ నుంచి క్లియరెన్స్ తీసుకున్న వారు ఓటు వేయొచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందే ఈ క్లియరెన్స్ వచ్చి జాబితాలో లిస్ట్ అయ్యి ఉండాలని స్పష్టం చేసింది. కాగా SIRతో బెంగాల్‌లో దాదాపు 91లక్షల ఓట్లు పోయాయి.

News April 16, 2026

మనం ఉదయం పొడుగ్గా.. రాత్రి పొట్టిగా ఉంటాం!

image

మనం నిద్రలేచినప్పుడు రాత్రి కంటే ఓ సెంటీమీటర్ ఎక్కువ ఎత్తు ఉంటాం. వింతగా ఉన్నా ఇది నిజం. రోజంతా నిలబడటం, కూర్చోవడం వల్ల వెన్నెముకలోని మృదులాస్థి ఒత్తిడికి గురై కుంచించుకుపోతుంది. కానీ రాత్రి పడుకున్నప్పుడు వెన్నెముక యథాస్థితికి చేరుకుంటుంది. అందుకే ఉదయం కాస్త పొడవుగా కనిపిస్తామని బ్రిటిష్ వైద్యులు వివరిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(48/100)