News July 26, 2024

జియో ఫ్రీడమ్ ఆఫర్.. 30% డిస్కౌంట్

image

మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జియో తాజాగా కొత్త ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లపై 30% డిస్కౌంట్ ప్రకటించింది. జులై 26 నుంచి ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌లో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను తొలగించింది. సాధారణంగా 3 నెలల స్టాండర్డ్ ప్లాన్ ₹2121, ₹1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జ్ చెల్లించాలి. కానీ ఆఫర్ కింద ₹2121 కడితే చాలు. ఇదే తరహాలో ఫోన్ రీఛార్జ్‌లూ తగ్గించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Similar News

News October 6, 2024

అది ఐపీఎల్ టోర్నీలోనే అతిపెద్ద మూవ్ అవుతుంది: ఏబీడీ

image

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ఆర్సీబీలో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే అతి పెద్ద మూవ్ కానుందని అభిప్రాయపడ్డారు. అయితే రోహిత్ ముంబైని వీడే అవకాశం 0.1శాతమేనని పేర్కొన్నారు. అది కూడా జరిగే అవకాశం లేదన్నారు. మరోవైపు గత సీజన్‌లో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించిన సంగతి తెలిసిందే.

News October 6, 2024

18 ఏళ్లపాటు రూ.49 వేల కోట్లు అక్రమంగా వసూలు!

image

అధిక రాబ‌డులు ఆశ‌చూపి రూ.వేల కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్న ఆరోపణలపై పెర‌ల్ ఆగ్రో కార్పొరేష‌న్ లిమిటెడ్ పై ఈడీ విచారణ జరుపుతోంది. 18 ఏళ్ల‌పాటు దేశవ్యాప్తంగా 5.8 కోట్ల‌ మంది నుంచి సదరు సంస్థ ఏకంగా రూ.49 వేల కోట్లు వ‌సూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 44 చోట్ల సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.

News October 6, 2024

ఈ పండును తిన్నారా?

image

విదేశాల నుంచి మనకు పరిచయమైన పండ్లలో రాంబూటన్ పండు ఒకటి. పైన ఎర్రగా ముళ్లలాగా, లోపల కండ భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు తీపి, పుల్లటి రుచులు కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మరి ఈ పండును మీరు తిన్నారా? కామెంట్ చేయండి.