News March 10, 2025

జియో కొత్త ప్లాన్.. రూ.100తో..

image

ఓటీటీ వ్యూయర్ల కోసం రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.100తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. హాట్‌స్టార్ ఫోన్ లేదా టీవీ ఏదైనా ఒకదానిలో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్లో ఎలాంటి వాయిస్ కాలింగ్ ఉండదు.

Similar News

News December 29, 2025

చివరి దశలో చర్చలు.. ఏం జరుగుతుందో: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఏం జరుగుతుందో చూడాలని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కీలక చర్చల కోసం ఫ్లోరిడాకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఆయన ఆహ్వానించారు. 2 దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని చెప్పారు. పుతిన్, జెలెన్‌స్కీ ఒప్పందం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. భేటీకి ముందు ట్రంప్‌, పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. మీటింగ్ తర్వాతా మాట్లాడనున్నారు.

News December 29, 2025

డిసెంబర్ 29: చరిత్రలో ఈరోజు

image

✒1530: బాబర్ పెద్దకొడుకు హుమయూన్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు ✒1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్‌ ఏర్పాటు
✒1965: మొదటి యుద్ధట్యాంకు వైజయంత ఆవడి తయారుచేసిన భారత్
✒1974: సినీ నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా జననం
✒1910: ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్ జననం
✒2022: బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే మరణం(ఫొటోలో)

News December 29, 2025

ఆ దేశాలతో పూర్తి స్థాయి యుద్ధం: ఇరాన్

image

అమెరికా, ఇజ్రాయెల్, యూరప్‌తో తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఇరాన్‌ సొంత కాళ్లపై నిలబడటం పశ్చిమ దేశాలకు ఇష్టం లేదని, తమను మోకరిల్లేలా చేయాలని అనుకుంటున్నాయని చెప్పారు. ‘ఇది మనపై ఇరాక్ చేసిన యుద్ధం కంటే దారుణమైనది. చాలా క్లిష్టమైనది. అన్నివైపుల నుంచి ముట్టడిస్తున్నారు. జీవనోపాధి, భద్రతాపరంగా సమస్యలు సృష్టిస్తున్నారు’ అని అన్నారు.