News October 26, 2024
జియో ఆఫర్.. రూ.699కే..
జియో భారత్ 4G ఫోన్ ధర రూ.999 నుంచి రూ.699కి తగ్గింది. ఈ ధర దీపావళి సందర్భంగా మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. ఇక ఈ ఫోన్‌లో వాడే నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ఇతర సంస్థల బేసిక్ ప్లాన్ కంటే రూ.76 తక్కువ ధరతో రూ.123 మాత్రమే అని వెల్లడించింది. ఈ రకంగా వినియోగదారులు 9 నెలల్లో ఫోన్ కోసం చెల్లించిన ధరను తిరిగి పొందవచవ్చని పేర్కొంది. ఇందులో అన్ని డిజిటల్ సేవలను జియో అందిస్తోంది.
Similar News
News November 14, 2024
లోకాయుక్త, SHRC.. కర్నూలు టు అమరావతి
AP: వైసీపీ హయాంలో కర్నూలులో ఏర్పాటుచేసిన లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(SHRC) కార్యాలయాలను అమరావతికి తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని SGP ప్రణతి హైకోర్టుకు నివేదించారు. ఇందుకు చట్ట సవరణ చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి విచారణను 3 నెలలకు వాయిదా వేశారు. కర్నూలులో లోకాయుక్త, SHRC ఆఫీసులను ఏర్పాటుచేయడాన్ని సవాల్ చేస్తూ మద్దిపాటి శైలజ అనే మహిళ గతంలో పిల్ దాఖలు చేశారు.
News November 14, 2024
అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గాన్ని, కీలక పదవుల్ని వేగంగా భర్తీ చేస్తున్నారు. భారత సంతతి మహిళ తులసీ గబ్బార్డ్‌ను జాతీయ నిఘా విభాగానికి డైరెక్టర్‌గా, ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను విదేశాంగ మంత్రిగా నామినేట్ చేశారు. చైనాపై రూబియో తరచూ ఘాటు విమర్శలు చేస్తుంటారు. మరోవైపు రక్షణ విభాగం నుంచి తొలగించాల్సిన అధికారుల పేర్లతో ఓ జాబితాను ట్రంప్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
News November 14, 2024
మొబైల్‌తో టాయిలెట్‌లోకి వెళ్తున్నారా? ఇది మీకోసమే!
టాయిలెట్‌లోకి మొబైల్ తీసుకెళ్లి అరగంటైనా కూర్చోనిదే కొందరికి సంతృప్తి కలగదు. కాలకృత్యాలు తీసుకునే సమయంలో ఇలాంటి అలవాటు ఏమాత్రం మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, 3-5 నిమిషాల్లోపే ఈ పని కానివ్వాలంటున్నారు. టాయిలెట్ కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల తుంటిపై ఒత్తిడి కలుగుతుంది. రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది పైల్స్‌కు దారితీస్తుంది.