News March 26, 2024
జియో రూ.555 రీఛార్జ్ ఫ్రీ అంటూ ప్రచారం
జియో ఫ్రీ రీఛార్జ్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ‘జియో ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఉచితంగా రూ.555 రీఛార్జ్ పొందండి’ అని మెసేజ్‌లు పంపుతున్నారని తెలిపారు. ఇలాంటి ఉచిత ఆఫర్లను నమ్మి, వారు పంపిన లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు చోరీ అవుతాయన్నారు. వాట్సాప్‌లలో వచ్చే ఇలాంటి నకిలీ ఆఫర్లను నమ్మవద్దని సూచించారు.
Similar News
News September 12, 2024
ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీఎం చంద్రబాబు
AP: రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగిందని సీఎం వారికి వివరించారు. ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. ప్రాథమికంగా రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన విషయం తెలిసిందే.
News September 12, 2024
సీతారాం ఏచూరితో సంభాషణలు మిస్సవుతా: రాహుల్ గాంధీ
అనారోగ్యంతో కన్నుమూసిన కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అనుచరులకు సానుభూతి వ్యక్తం చేశారు. ‘సీతారాం ఏచూరి ఓ స్నేహితుడు. భారత్ అన్న ఆలోచనకు రక్షకుడు. దేశంపై ఆయనకు మంచి అవగాహన ఉంది. తరచూ మా మధ్య జరిగే సంభాషణలను ఇకపై నేను మిస్సవుతాను’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలూ ఏచూరి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
News September 12, 2024
కోలుకుంటున్న రవితేజ.. LATEST PHOTO
హీరో రవితేజకు ఇటీవల షూటింగ్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులు ఆందోళనకు లోనవుతుండటంతో చిన్నగాయమేనని రవితేజ అప్‌డేట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ప్రమాదం తర్వాత తొలిసారిగా రవి ఫొటో బయటికొచ్చింది. డైరెక్టర్ బాబీతో భేటీ అనంతరం తీసిన ఆ ఫొటోలో ఆయన చేతికి కట్టుతో కనిపిస్తున్నారు. దీంతో రవితేజ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనాలంటూ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.