News October 30, 2024

JIO SMART GOLD: రూ.10తోనే పెట్టుబడి పెట్టొచ్చు

image

జియో ఫైనాన్స్ డిజిటల్ గోల్డ్ సేవలను ఆరంభించింది. తమ యాప్‌లోని స్మార్ట్‌గోల్డ్ ఆప్షన్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపింది. కనీస పెట్టుబడి రూ.10గా పేర్కొంది. ‘కస్టమర్లకు స్మార్ట్‌గోల్డ్ డిజిటల్, సేఫ్, సెక్యూర్ సేవలు అందిస్తుంది. నగదు, గోల్డ్ కాయిన్స్, నగల రూపంలోకి రిడీమ్ చేసుకోవచ్చు. గోల్డ్‌ను ఇంటికే డెలివరీ చేస్తాం’ అని తెలిపింది. Paytm, PhonePe సైతం ఈ సర్వీసెస్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 14, 2024

VIRAL: తాజ్‌మహల్ కనిపించట్లేదు!

image

ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి కాలుష్యంగా మారడంతో కొన్ని అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కూడా చూడలేకపోతున్నారు. దీనిని కళ్లకు కట్టినట్లు చూపెట్టే ఫొటోలు వైరలవుతున్నాయి. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్‌ సందర్శనకు వెళ్లిన పర్యాటకులు ‘తాజ్‌మహల్ కనిపించట్లేదు.. ఎక్కడుందో కనిపెట్టాలి’ అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.

News November 14, 2024

రేపు 2 విశేషాలు.. మార్కెట్లకు సెలవు

image

భారత స్టాక్‌మార్కెట్లు శుక్రవారం పనిచేయవు. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15న ఈక్విటీ, డెరివేటివ్స్ మార్కెట్లకు సెలవు. కమోడిటీస్ మార్కెట్లు మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేస్తాయి. దీంతో మార్కెట్ వర్గాలకు 3 రోజుల విరామం లభించినట్టైంది. ప్రస్తుతం దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా రెండోవారమూ పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ చెరో 2%, బ్యాంకు నిఫ్టీ 3% తగ్గాయి.

News November 14, 2024

గ్రూప్-4 ఫలితాలు విడుదల

image

TG: గ్రూప్-4 ఫలితాలు వెల్లడయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ లిస్టును TGPSC సైట్‌లో పొందుపర్చారు. ఈ బటన్ <>క్లిక్<<>> చేసి ఫలితాలు చూసుకోండి. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి 2023 జులైలో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. తాజాగా తుది ఫలితాలను రిలీజ్ చేశారు.