News November 12, 2024

JioStar వచ్చేస్తోంది!

image

టెలికం రంగంలో చక్రం తిప్పుతున్న ‘జియో’, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌నూ ఊపేసేందుకు సరికొత్తగా వస్తోంది. Disney Hotstarతో Jio Cinema కలిసి JioStar పేరుతో మార్కెట్‌లోకి త్వరలో రానుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు జియోస్టార్ గట్టి కాంపిటీటర్ కానుంది. టెలికంలో తెచ్చినట్లే తక్కువ ధరతో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొచ్చి సినిమాలు, సిరీస్‌లను అందిస్తే OTTలోనూ దూసుకెళ్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News December 13, 2025

దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం

image

స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లవుతున్నా దేశంలో ఇంకా 40547 గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. ఈ జాబితాలో MPలో 9246, గుజరాత్‌లో 2443, ఛత్తీస్‌గఢ్‌లో 2692, J&Kలో 2262, ఝార్ఖండ్ 2787, కేరళ 2335, WBలో 2748 గ్రామాలున్నాయి. APలో 413, TGలో 173 గ్రామాలకు రోడ్ల లింకేజ్ లేదని కేంద్రం వెల్లడించింది. PMGSY కింద 2029 నాటికి వీటికి రోడ్ల కనెక్టివిటీ చేపడతామని పేర్కొంది. పార్లమెంటులో ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

News December 13, 2025

మోగ్లీ మూవీ రివ్యూ&రేటింగ్

image

ప్రేమించిన యువతి కోసం క్రిమినల్ పోలీ‌స్‌తో హీరో చేసే పోరాటమే మూవీ కథ. రోషన్ యాక్టింగ్, బధిర యువతిగా హీరోయిన్, బండి సరోజ్ నటన మెప్పిస్తాయి. వైవా హర్ష కామెడీ నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్ ఫర్వాలేదు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌ లవ్‌స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. కర్మ సిద్ధాంతంతో లింక్ పెట్టి సందీప్ రాజ్ కథ అల్లారు.
రేటింగ్:2.25/5

News December 13, 2025

వారితో కేరళ విసిగిపోయింది: మోదీ

image

తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDA <<18552178>>గెలవడం<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ‘థాంక్యూ తిరువనంతపురం. ఈ గెలుపు కేరళ రాజకీయాల్లో కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు నిశ్చయించుకున్నారు. UDF, LDFతో కేరళ విసిగిపోయింది. వికసిత్ కేరళకు, సుపరిపాలనకు మరో ఆప్షన్‌గా ఎన్డీయేను ప్రజలు చూస్తున్నారు’ అని పలు ట్వీట్లు చేశారు. BJP-NDAకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.