News November 12, 2024
JioStar వచ్చేస్తోంది!
టెలికం రంగంలో చక్రం తిప్పుతున్న ‘జియో’, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌నూ ఊపేసేందుకు సరికొత్తగా వస్తోంది. Disney Hotstarతో Jio Cinema కలిసి JioStar పేరుతో మార్కెట్‌లోకి త్వరలో రానుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు జియోస్టార్ గట్టి కాంపిటీటర్ కానుంది. టెలికంలో తెచ్చినట్లే తక్కువ ధరతో సబ్‌స్క్రిప్షన్ తీసుకొచ్చి సినిమాలు, సిరీస్‌లను అందిస్తే OTTలోనూ దూసుకెళ్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 8, 2024
ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు తెలుసా?
కొన్ని ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రేటుతో దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని స్కీములు..
➤ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2%
➤ సుకన్య సమృద్ధి యోజన : 8%- 8.2%
➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7%
➤ కిసాన్ వికాస్ పాత్ర: 7.5%
➤ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4%
➤ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్: 7.1%
News December 8, 2024
బుమ్రాకు గాయమైందా?
అడిలైడ్‌లో జరుగుతున్న BGT రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ టీమ్ఇండియా బౌలర్ బుమ్రా ఇబ్బంది పడ్డారు. 81వ ఓవర్ వేస్తున్న సమయంలో గ్రౌండ్‌లో కిందపడగా, ఫిజియో వచ్చి చికిత్స అందించారు. బుమ్రాకు గాయమైందనే ఆందోళన నేపథ్యంలో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇచ్చారు. గాయం కాలేదని కేవలం కాళ్లు తిమ్మిరెక్కాయన్నారు. రెండో ఇన్సింగ్స్‌లో 128/5 వద్ద ఉన్న భారత్ గెలవాలంటే బుమ్రా మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది.
News December 8, 2024
నేడు ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో.. ట్రాఫిక్ ఆంక్షలు
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నేడు HYD ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో షో జరగనుండగా, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్ షో జరగనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి షో ముగిసే వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.