News May 18, 2024

పంజాబ్ కెప్టెన్‌గా జితేశ్ శర్మ

image

రేపు హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌కు పంజాబ్ కెప్టెన్‌గా జితేశ్ శర్మ వ్యవహరించనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ సామ్ కరన్ స్వదేశం వెళ్లిపోవడంతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఈ సీజన్‌లో జితేశ్ పూర్తిగా నిరాశపరిచారు. 13 మ్యాచ్‌లు ఆడి 155 పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు పంజాబ్ కూడా ఈ సీజన్‌లో ఆకట్టుకోలేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లోనే గెలిచింది.

Similar News

News November 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 71 సమాధానాలు

image

ప్రశ్న: గణేశుడు భారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
జవాబు: వినాయకుడు భార‌తం రాసేట‌ప్పుడు ఈకలు ప్రతిసారి విరిగిపోయాయి. రచనను మ‌ధ్య‌లో ఆగిపోకూడ‌ద‌నే ష‌ర‌తుకు క‌ట్టుబ‌డిన గ‌ణేషుడు ఈకలతో పని కాదని గ్రహించి త‌న దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాయ‌డం పూర్తిచేశాడు. మ‌రో క‌థనం ప్ర‌కారం.. ప‌ర‌శురాముణ్ని నిరోధించ‌డంతో రెండు దంతాల్లో ఒక దాన్ని విరిచేస్తాడ‌ని చెబుతారు. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 19, 2025

ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారు: మాన్య

image

హీరో ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారని తమిళ నటి మాన్య ఆనంద్ ఆరోపించారు. ధనుష్ నిర్మించే సినిమాలో నటించేందుకు శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశాడన్నారు. ధనుష్ కోసమంటూ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పాడన్నారు. స్క్రిప్ట్, ప్రొడక్షన్ హౌస్ లొకేషన్ పంపగా నంబర్‌ను బ్లాక్ చేశానని చెప్పారు. దీనిపై ధనుష్ టీమ్ స్పందిస్తూ మేనేజర్ పేరిట ఎవరో అమ్మాయిల్నిబ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.

News November 19, 2025

రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.