News October 8, 2024
JK 90/90: కాంగ్రెస్ 9, NC 39 స్థానాల్లో లీడింగ్

జమ్మూకశ్మీర్లో 90 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ 56కు 39, కాంగ్రెస్ 39కి 9 స్థానాల్లో ఆధిక్యం లభించింది. CPM, JJNNP చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా ఈ కూటమి 49 స్థానాల్లో దూకుడు కొనసాగిస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసినట్టే లెక్క. LG ఐదుగుర్ని నామినేట్ చేసినా వారికి ఫర్వాలేదు. BJP 62 చోట్ల పోటీ చేయగా 29 స్థానాల్లో ముందంజలో ఉంది. PDP 81కి 4 చోట్ల ముందుంది.
Similar News
News March 26, 2026
భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జీవో 76 ప్రకారం అర్హులకు పట్టాలు జారీ చేయాలన్నారు. భూ సమస్యలతో పాటు ఎలక్షన్ మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
News March 26, 2026
రేపు జాగ్రత్త: APSDMA

AP: రాష్ట్రంలో రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. మన్యం (D) గుమ్మలక్ష్మీపురం, కురుపాం, అల్లూరి(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ(D) జగ్గంపేట, తూ.గో.(D) కోరుకొండ, ఎన్టీఆర్(D) జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అత్యవసరమైతేనే బయటకు రావాలంది. మంచి నీరు, మజ్జిగ, ORS ఎక్కువగా తాగాలని సూచించింది.
News March 26, 2026
కొత్తగా 620 డ్రైవింగ్ స్కూళ్లతో కోటి ఉద్యోగాలు: నితిన్ గడ్కరీ

దేశంలోని 120 జిల్లాలు, 500 బ్లాకు(జిల్లా సబ్‌డివిజన్)ల్లో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన ప్రాంతాల్లో వీటిని ప్రారంభిస్తామని వెల్లడించారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే 200 డ్రైవింగ్ స్కూళ్లు ఓపెన్ చేసిందని పేర్కొన్నారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందన్నారు.


