News October 8, 2024

JK 90/90: కాంగ్రెస్‌ 9, NC 39 స్థానాల్లో లీడింగ్

image

జమ్మూకశ్మీర్లో 90 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ 56కు 39, కాంగ్రెస్ 39కి 9 స్థానాల్లో ఆధిక్యం లభించింది. CPM, JJNNP చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా ఈ కూటమి 49 స్థానాల్లో దూకుడు కొనసాగిస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసినట్టే లెక్క. LG ఐదుగుర్ని నామినేట్ చేసినా వారికి ఫర్వాలేదు. BJP 62 చోట్ల పోటీ చేయగా 29 స్థానాల్లో ముందంజలో ఉంది. PDP 81కి 4 చోట్ల ముందుంది.

Similar News

News January 16, 2026

చిత్తూరు: అధికారుల గ్రూపులో న్యూడ్ వీడియోలు

image

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ అధికారుల గ్రూపులో న్యూడ్ వీడియోలు కలకలం రేపాయి. ‘సమాచార శాఖ.కుప్పం’ గ్రూపులో I&PR డీడీ పేరిట న్యూడ్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. వీటితో పాటు ఓ APK ఫైల్ సైతం వచ్చింది. దీంతో ఇతర ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. వెంటనే గ్రూపులో ఆ వీడియోలు తొలగించారు. డీడీ ఫోన్ హ్యాక్ కావడంతోనే ఇలా జరిగిందని సమాచారం. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

News January 16, 2026

మరియా గొప్ప మహిళ: ట్రంప్

image

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మరియాతో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. చాలా కష్టాలను ఎదుర్కొన్న ఆమె గొప్ప మహిళ అని కొనియాడారు. తాను చేసిన కృషిని గౌరవిస్తూ నోబెల్ శాంతి బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవానికి ఇదో గొప్ప సూచిక అని చెప్పారు. ఈ సంద్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

News January 16, 2026

క్షణాల్లో మెరిసే అందం మీ సొంతం

image

ఏదైనా ఫంక్షన్లు, పెళ్లిల్లు, పార్టీలు ఉంటే అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడితే ఇన్‌స్టంట్ గ్లో వస్తుందంటున్నారు నిపుణులు. * బాగా పండిన అరటిపండు, తేనె, శనగపిండి, కాఫీ పౌడర్ కలిపి చర్మానికి అప్లై చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. -ఓట్స్‌ గంటపాటు నానబెట్టి తేనె కలిపి పేస్ట్ చేసి దాన్ని చర్మానికి అప్లై చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.