News September 26, 2024
JK Elections: 40% ఓటేసిన మైగ్రెంట్ కశ్మీరీ పండిట్స్
జమ్మూకశ్మీర్ రెండోదశ పోలింగులో వలసవెళ్లిన కశ్మీరీ పండితుల్లో 40% ఓటేశారు. వీరికోసం వేర్వేరు ప్రాంతాల్లో 24 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జమ్మూలోని 19 స్టేషన్లలో 40%, ఉధంపూర్‌లో 37%, ఢిల్లీలో 43% ఓటేశారని రిలీఫ్, రిహబిలిటేషన్ కమిషనర్ అరవింద్ కర్వాని తెలిపారు. పురుషులు 3514, మహిళలు 2736 మంది ఓటేశారు. హబాకడల్ నియోజకవర్గంలో 2796 ఓట్లు పోలయ్యాయి. లాల్‌చౌక్‌లో 909, జడిబాల్‌లో 417 ఓట్లు పడ్డాయి.
Similar News
News October 5, 2024
నేనిప్పుడు గాంధేయవాదిని: ఉగ్రవాది యాసిన్ మాలిక్
తాను 1994 నుంచే హింసను వదిలేశానని, ఇప్పుడు గాంధేయవాదినని ఉగ్రవాది, వేర్పాటువాది యాసిన్ మాలిక్ చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) ట్రిబ్యునల్‌కు తెలిపారు. శాంతియుత విధానాల్లోనే స్వతంత్ర, ఐక్య కశ్మీర్‌ను సాధించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మాలిక్ ప్రస్తుతం తిహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 1990లో భారత వాయుసేనకు చెందిన నలుగురు అధికారుల హత్యలో మాలిక్ ప్రధాన నిందితుడు.
News October 5, 2024
అత్యంత అరుదైన ఖగోళ దృశ్యం.. మళ్లీ 80వేల ఏళ్ల తర్వాతే!
మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సుచిన్‌షాన్-అట్లాస్ అనే తోకచుక్క భూమికి 44 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని నాసా వెల్లడించింది. 2023లో సూర్యుడికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు దీన్ని తొలిసారి గుర్తించామని పేర్కొంది. ఈ నెల 9-10 తేదీల మధ్య స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వివరించింది. ఈ తోకచుక్క భూమి సమీపానికి మళ్లీ వచ్చేది మరో 80వేల సంవత్సరాల తర్వాతే!
News October 5, 2024
హర్షసాయిపై లుక్‌అవుట్ నోటీసులు
TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.