News August 26, 2024

JK ఎన్నికలు: బీజేపీ తొలి జాబితాలో ముస్లిములకు పెద్దపీట

image

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శంఖం పూరించింది. తొలి విడతలో 44 మంది పేర్లను ప్రకటించింది. ముస్లిం అభ్యర్థులకు ఎక్కువ సీట్లిచ్చి ఆశ్చర్యపరిచింది. అర్షిద్ భట్, జావెద్ అహ్మద్, మహ్మద్ రఫీక్, సయ్యద్ వజాహత్, అబ్దుల్ ఘని, సుష్రీ షాగున్, గజయ్ సింగ్ రాణా, కుల్‌దీప్ రాజ్, రోహిత్ దూబె, పవన్ గుప్తా, దేవిందర్, మోహన్ లాల్ భగత్ పేర్లు జాబితాలో ఉన్నాయి. ఈ ఎన్నికలపై మోదీ, షా ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Similar News

News September 18, 2024

పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం

image

AP: పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తిచేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.

News September 18, 2024

ఆ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు: రంగనాథ్

image

TG: బుల్డోజర్లతో నేరస్థులు, నిందితుల ఇళ్లను కూల్చడం ఆపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన <<14124312>>ఆదేశాలు<<>> ‘హైడ్రా’కు వర్తించవని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నేరస్థులు, నిందితుల ఆస్తుల జోలికి ‘హైడ్రా’ వెళ్లడం లేదన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని స్పష్టం చేశారు.

News September 18, 2024

వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త యూనిఫామ్

image

AP: ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌లను వచ్చే విద్యాసంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించింది. అక్టోబర్ మొదటి వారంలోనే టెండర్లు నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే రోజే పిల్లలకు కిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వాటిపై ఎలాంటి పార్టీల రంగులు లేకుండా చర్యలు తీసుకోనుంది.