News July 20, 2024
అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: సీఎం రేవంత్

TG: విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తుందని CM <<13666920>>రేవంత్ రెడ్డి<<>> వెల్లడించారు. ‘నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు. వారి విజ్ఞప్తి మేరకే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేశాం. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఏటా డిసెంబర్ 9 నాటికి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాం. UPSC తరహాలో TGPSCలో మార్పులు చేపట్టాం’ అని CM ప్రకటించారు.
Similar News
News February 11, 2025
1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదు: చంద్రబాబు

AP: గిరిజనుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. <<15423800>>1/70 చట్టాన్ని<<>> తొలగించే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుతాం. వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాం. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. 1/70 చట్టంపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. ఆందోళన, అపోహలతో గిరిజనులు ఆందోళన చెందొద్దు’ అని సీఎం పేర్కొన్నారు.
News February 11, 2025
సభలో మాట్లాడటానికే కదా గెలిపించింది: జీవీ

AP: అసెంబ్లీ అంటే భయంతోనే మాజీ CM జగన్ రావట్లేదని ప్రభుత్వ చీఫ్ విప్ GV ఆంజనేయులు ఆరోపించారు. ‘జగన్ అసెంబ్లీకి రాననడం సమంజసమేనా? ఆయనకు కనీసం ఇంగితజ్ఞానం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది సభ కాదు.. ప్రజలు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చిస్తే సమాధానమిస్తాం. ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టే రావట్లేదు. గతంలో ఏ నాయకుడూ ఇలా చేయలేదు. సభలో మాట్లాడటానికే కదా ప్రజలు గెలిపించింది’ అని నిలదీశారు.
News February 11, 2025
రేపే ‘VD12’ టీజర్.. భారీగా అంచనాలు!

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘VD12’ సినిమా నుంచి రేపు రిలీజయ్యే టీజర్‌పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీనికి స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తుండటం విశేషం. తమిళ టీజర్‌కు సూర్య, హిందీకి రణ్‌బీర్ కపూర్ వాయిస్ అందించినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న నిర్మాత నాగవంశీ కూడా ‘టైగర్’ ఎమోజీని ట్వీట్ చేశారు.