News November 15, 2024
US డోజ్ నుంచి జాబ్ నోటిఫికేషన్
యూఎస్ డోజ్ (DOGE) జాబ్ అప్లికేషన్లను ఆహ్వానించింది. అమెరికా ఫెడరల్ పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దడం సహా అనవసర ఖర్చులను తగ్గించేలా నిత్యం వ్యూహాలను ప్రతిపాదించే సమర్థుల కోసం వెతుకుతోంది. సూపర్ IQ ఉన్న వ్యక్తులు వారంలో 80 గంటలకుపైగా పనిచేయగలిగిన వారు తమ CVలను పంపాలని కోరింది. వీరిలో టాప్ 1% అభ్యర్థులను మస్క్, వివేక్ రామస్వామి రివ్యూ చేసి ఎంపిక చేస్తారని డోజ్ తెలిపింది.
Similar News
News December 10, 2024
పవన్ కళ్యాణ్‌కు బెదిరింపులు.. మద్యం మత్తులో నిందితుడు
AP: పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానని <<14834003>>హత్యా బెదిరింపులకు<<>> పాల్పడిన వ్యక్తిని మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. మల్లికార్జున రావు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.
News December 10, 2024
వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి?
AP: సీఎం చంద్రబాబు ఆఫీసుకు వంగవీటి రాధ కాసేపట్లో వెళ్లనున్నారు. రాధకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
News December 10, 2024
టీమ్ ఇండియా ప్లేయర్ సుదర్శన్‌కు సర్జరీ
టీమ్ ఇండియా క్రికెటర్ సాయి సుదర్శన్‌కు సర్జరీ జరిగింది. ‘నాకు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు, చేయించిన బీసీసీఐకి, అండగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా IPL మెగావేలానికి ముందే సుదర్శన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.8.50 కోట్లకు రిటైన్ చేసుకుంది.