News July 30, 2024
డిగ్రీ అర్హతతో RBIలో ఉద్యోగాలు
ఆర్బీఐలో 94 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జనరల్ ఆఫీసర్లు-66, DEPR ఆఫీసర్లు-21, DSIM ఆఫీసర్లు-7 పోస్టులున్నాయి. 60% మార్కులతో డిగ్రీ/ 55% మార్కులతో పీజీ పాసైన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్లు(రిజర్వేషన్ బట్టి సడలింపు). దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 16. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం రూ.55,200 ఉంటుంది.
వెబ్‌సైట్: <
Similar News
News February 1, 2025
SSM29 గురించి జక్కన్న చెప్పేది అప్పుడేనా?
మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కే SSMB29 షూటింగ్ విజయవాడ సమీపంలో వేసిన సెట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ నిబంధనల విషయంలో దర్శకుడు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు టాక్. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న జక్కన్న, తర్వాతి షెడ్యూల్ కెన్యా అడవుల్లో ప్లాన్ చేశారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. అది పూర్తయ్యాక మూవీ టీమ్ గురించి వీడియోలో లేదా ఈవెంట్‌లో వివరించనున్నట్లు సమాచారం.
News February 1, 2025
BUDGET: వీటి ధరలు తగ్గుతాయ్
ధరలు తగ్గేవి: మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, LED, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్&మెడిసిన్స్, ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి), కారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్.
ధరలు పెరిగేవి: ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే, నిటెడ్ ఫ్యాబ్రిక్స్ (అల్లిన దుస్తులు)
News February 1, 2025
BUDGET 2025-26: కీలకాంశాలు
* ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంపు
* అద్దెలపై వార్షిక TDS పరిధి రూ.6 లక్షలు
* స్టార్టప్స్ మొదలైననాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు
* 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు
* బీమా రంగంలో FDI పరిధి 100శాతానికి పెంపు
* పదేళ్లలో 100 స్థానిక ఎయిర్‌పోర్టుల నిర్మాణం
* వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు
* 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు
* కిసాన్ క్రెడిట్ కార్డు రుణం రూ.5 లక్షలకు పెంపు