News October 8, 2025
TGSRTCలో జాబ్స్.. నేటి నుంచి దరఖాస్తులు

TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. SC, ST, BC, EWS కేటగిరీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంది. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసేందుకు <
Similar News
News October 8, 2025
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టితీరుతాం: మంత్రి ఉత్తమ్

TG: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ‘2 అలైన్‌మెంట్లను పరిశీలిస్తున్నాం. ఈనెల 22 నాటికి ఒక దానిని ఖరారు చేస్తాం. 1st అలైన్‌మెంట్‌లో తుమ్మిడిహెట్టి-మైలారం 71.5kms గ్రావిటీ కెనాల్, 14kms టన్నెల్ ద్వారా సుందిళ్లకు నీటి తరలింపు, 2nd దానిలో పంపింగ్ స్టేషన్‌తో ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించే ప్లాన్ ఉంది’ అని తెలిపారు.
News October 8, 2025
గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు వాడరు?

తులసీ దేవి, గణేషుణ్ని చూసి తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది. కానీ నిరాకరిస్తాడు. దీంతో ఆమె కోపంతో బ్రహ్మచారిగా ఉంటావని శపిస్తుంది. ప్రతిగా గణేషుడు ఆమెను రాక్షసుని చెంత ఉండమని శపించాడు. ఆయన శాపానికి చింతించిన ఆమె మన్నించమని అడిగింది. గణేషుడు శాంతించి పవిత్రమైన మొక్కగా జన్మిస్తావని వరమిస్తాడు. కానీ తన పూజలో ఆ పత్రం ఉండటాన్ని నిరాకరిస్తాడు. ఆయన పూజలో తులసి ఆకులు వాడితే పూజాఫలం దక్కదని ప్రతీతి.
News October 8, 2025
విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్‌డేట్!

విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్దన’ టైటిల్‌తో ఓ సినిమా తీయనున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 11న లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 16వ తేదీ నుంచి ముంబైలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ‘రాజావారు రాణిగారు’ సినిమా ఫేమ్ రవి కిరణ్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తారని సమాచారం.