News November 28, 2024
నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తీసేస్తాం: సీఎం
TG: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్ఠికాహారం అందించాలని CM రేవంత్ కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించామని, డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. అయినా కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారన్నారు.
Similar News
News November 28, 2024
BGTలో విరాట్ పరుగుల వరద పారిస్తారు: ద్రవిడ్
BGT సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తారని భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంచనా వేశారు. ‘కష్టమైన పిచ్‌లపై కూడా కోహ్లీ చాలా బాగా ఆడుతున్నారు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాలో ఆడినప్పుడూ ఆయన బ్యాటింగ్ బాగుంది. BGT సిరీస్‌లో తొలిమ్యాచ్‌లోనే సెంచరీ చేయడం చాలా విశ్వాసాన్నిస్తుందనడంలో డౌట్ లేదు. సిరీస్‌లో భారీగా పరుగులు చేస్తారనుకుంటున్నాను’ అని స్టార్ స్పోర్ట్స్‌లో పేర్కొన్నారు.
News November 28, 2024
వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
AP: వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. వృద్ధాప్య పింఛను తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛను మంజూరయ్యేలా నిర్ణయించింది. భర్త ఒకటో తేదీ నుంచి 15 లోపు మరణిస్తే వెంటనే పింఛన్ ఇవ్వాలని, 15 నుంచి 30తేదీ లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని స్పష్టం చేసింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని, ఆసరాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
News November 28, 2024
కాంగ్రెస్, BRS ఒకటే: బండి సంజయ్
TG: బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేస్తున్నారన్న KTR వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. ‘BJP, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయంటే చిన్న పిల్లాడు కూడా నమ్మడు. మోదీ నాయకత్వంలో మా పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తుండటాన్ని KTR జీర్ణించుకోలేకపోతున్నారు. BRS హయాంలో జరిగిన స్కామ్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, BRS ఒకటే అనడానికి ఇదే నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.