News November 28, 2024
నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తీసేస్తాం: సీఎం
TG: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్ఠికాహారం అందించాలని CM రేవంత్ కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించామని, డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. అయినా కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారన్నారు.
Similar News
News December 9, 2024
చెక్‌పై అమౌంట్ పక్కన ‘Only’ ఎందుకు రాస్తారు?
ఈ డౌట్ మీకు వచ్చిందా? ఉదాహరణకు చెక్‌పై రూ.1,00,000 ఇలా రాసిన తర్వాత ONE Lakh Rupees Only రాయడం గమనించే ఉంటారు. చెక్ ట్యాంపర్ అవ్వకుండా, మనం రాసిన అమౌంట్ పక్కన నంబర్లు చేర్చకుండా ఉండేందుకు ఓన్లీ అని రాయడం ముఖ్యం. పదాలలో రాసి చివర ఓన్లీ అని రాయడం వల్ల సంఖ్యను మార్చినా, పదాలను ఛేంజ్ చేయలేదు. ఒకవేళ కొట్టేసి రాసినా అలాంటి చెక్కులను బ్యాంకులు అంగీకరించవు. మోసాలను నివారించడానికి Only మస్ట్.
News December 9, 2024
రూపం ఏదైనా తెలంగాణ తల్లి ప్రతిరూపమే: విజయశాంతి
TG: రూపం ఏదైనా బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం మనకు ప్రతినిత్యం ప్రాతస్మరణీయం అని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. అమ్మోరు తల్లి లెక్క నూరు రూపాలైనా, ఏ రూపంలో ఉన్నా మన తెలంగాణ తల్లి ప్రతిరూపమే అని చెప్పారు. నిర్బంధాలను దాటుకొని 2007లో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అయిందన్నారు. ఆ తర్వాత BRS, ఇప్పుడు కాంగ్రెస్ ఆవిష్కరిస్తున్న విగ్రహం తెలంగాణ తల్లి ప్రతిరూపమే అన్నారు.
News December 9, 2024
రష్యా చేరుకున్న సిరియా అధ్యక్షుడు
సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అసద్ దేశాన్ని వీడారు. కాగా, ఆయన విమానాన్ని రెబల్స్ కూల్చేశారనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా సంస్థలు స్పష్టత ఇచ్చాయి. కుటుంబంతో సహా అసద్ రష్యా చేరుకున్నట్లు తెలిపాయి. వారి కుటుంబానికి మానవతా కోణంలో రష్యా ఆశ్రయం కల్పించినట్లు వివరించాయి. తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం అసద్ సిరియాను వీడారని ఇప్పటికే రష్యా తెలిపింది.