News February 22, 2025

రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 246 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ నెల 28 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. సీబీటీ, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
సైట్: iocl.com

Similar News

News January 21, 2026

లైఫ్ ఇన్సూరెన్స్: ప్రీమియం చెల్లింపులో జాప్యం చేస్తే..?

image

టర్మ్ ఇన్సూరెన్స్‌ నెలవారీ ప్రీమియానికి 15రోజులు, మూడు, ఆరు నెలల ప్రీమియం చెల్లించేందుకు 30రోజుల సమయం ఇస్తారు. అప్పటికీ ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ ల్యాప్స్ అవుతుందని గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ MD సబ్యసాచి తెలిపారు. ‘దీంతో క్లయింట్లు కవరేజీ కోల్పోతారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరిస్తాయి. అందుకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తంతో పాటు వడ్డీని వసూలు చేస్తాయి’ అని వివరించారు.

News January 21, 2026

‘మూసీ పునరుజ్జీవనం’లో ‘టాటా’ భాగస్వామ్యం

image

TG: దావోస్‌లో టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విజన్–2047 లక్ష్యాలు, రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూల విధానాలను వివరించారు. HYDలోని స్టేడియాల అభివృద్ధికి సహకరించాలని కోరగా టాటా ఛైర్మన్ సంసిద్దత తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి వ్యక్తపరిచారు. హోటళ్లు, రిసార్ట్స్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు CM చంద్రశేఖరన్ చర్చించారు.

News January 21, 2026

గుండెపోటుతో నటుడు మృతి

image

మలయాళ నటి ఊర్వశి సోదరుడు, నటుడు కమల్ రాయ్(54) కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. తమిళ్ సినిమా ‘పుతుస పడికిరెన్ పాటు’ సినిమాతో హీరోగా పరిచయమైన కమల్ 30 చిత్రాల్లో నటించారు. ఇందులో సాయుజ్యం, మంజు, కింగిని, వచలమ్, శోభనం, ది కింగ్ మేకర్, లీడర్ తదితర సినిమాలున్నాయి. ఆయన సోదరి ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మొత్తం 350 చిత్రాల్లో నటించారు.