News February 22, 2025
రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 246 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ నెల 28 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. సీబీటీ, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
సైట్: iocl.com
Similar News
News March 18, 2025
‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం: మంత్రి

AP: గతేడాది విజయవాడను ముంచేసిన బుడమేరు వాగుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు ప్రారంభించామని మంత్రి నిమ్మల తెలిపారు. ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నిధుల విడుదలకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు సరస్సు వరకు కాలువల ప్రవాహ మార్గం సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతామన్నారు.
News March 18, 2025
భారత్ టెస్టుల్లో పేలవం.. రోహిత్‌దే బాధ్యత: గంగూలీ

టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో బాగా ఆడుతున్నా టెస్టుల్లో పేలవమేనని మాజీ క్రికెటర్ గంగూలీ అన్నారు. ‘కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ బాధ్యత తీసుకోవాలి. టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడి సామర్థ్యానికి మరింత మెరుగ్గా ఆడి ఉండాల్సింది. ఇంగ్లండ్‌తో ఆడనున్న టెస్టుల్లో గెలుపులపై రోహిత్ ముందుగానే ప్లాన్ వేయాలి. తెల్లబంతి ఫార్మాట్లలో మాత్రం అతడికి తిరుగులేదు’ అని కొనియాడారు.
News March 18, 2025
మందుబాబులకు గుడ్ న్యూస్!

TG: కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్త బీర్లు అమ్మేందుకు TGBCLకు దాదాపు 40 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలించి ఎంపిక చేయనుంది. అన్ని పూర్తయితే ఏప్రిల్ నుంచి అమ్మకాలు జరిపేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53 దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.