News October 2, 2024
టెన్త్ అర్హతతో ఉద్యోగాలు
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 108 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/EWSకు ఫీజు రూ.450 ఎస్సీ/ఎస్టీ/PWDకి రూ.50. వయసు: 18 నుంచి 30 ఏళ్లు. టెన్త్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. సైట్: https://www.nabard.org/
Similar News
News October 10, 2024
ఎంత మంచి మనసయ్యా నీది!
రతన్ టాటా తన ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేవారు. తన ఉద్యోగి ఒకరు అనారోగ్యం పాలయ్యాడని తెలుసుకుని 83 ఏళ్ల వయసులో పుణే వెళ్లి పరామర్శించారు. మీడియాకు తెలియకుండా ఆ ఫ్యామిలీకి ఆర్థికసాయం చేశారు. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రభావితమైన 80 మంది తాజ్ హోటల్ ఉద్యోగులకు ఆర్థికసాయం చేయడంతో పాటు వారి పిల్లల చదువు బాధ్యతలను తీసుకున్నారు. కరోనా సంక్షోభంలోనూ టాటా గ్రూప్ నుంచి ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు.
News October 10, 2024
బరి తెగించిన టీడీపీ ఎమ్మెల్యేలు: VSR
AP: మద్యం షాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్‌గా మారి సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘కమీషన్లు, దందాలతో ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు. వాళ్ల అవినీతి పరాకాష్ఠకు చేరింది. 4 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. MLAలపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. లేదంటే శ్వేతపత్రం సమర్పించి విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేశారు.
News October 10, 2024
పాక్‌తో టెస్టు.. చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. 150 ఓవర్లలోనే 823/7(D) స్కోర్ చేసి పలు రికార్డులు సొంతం చేసుకుంది. 800పైన స్కోర్ 3 సార్లు చేసిన తొలి జట్టు, 5.48 రన్‌రేట్‌తో 700పైన రన్స్ చేసిన మొదటి టీమ్‌గా ENG నిలిచింది. అలాగే టెస్టు క్రికెట్‌లో ఇది నాలుగో అత్యధిక స్కోర్. తొలి స్థానంలో శ్రీలంక 952/5d(vsIND) ఉండగా, ఆ తర్వాత ఇంగ్లండ్ 903/7d(vs AUS), 848(vsWI) ఉంది.