News September 13, 2024
జోగి రమేశ్, అవినాశ్‌కు సుప్రీంలో స్వల్ప ఊరట
AP: TDP ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో YCP నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌కు సుప్రీంకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తి స్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామంది. నిందితులు 24 గంటల్లో పాస్ పోర్టులు అప్పగించాలని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలంది. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు సుప్రీంను ఆశ్రయించారు.
Similar News
News October 11, 2024
తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News October 11, 2024
మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు
AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 చోట్ల షాపులకు ఒక్కోటి చొప్పున, 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
News October 11, 2024
రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి
AP: ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు.