News April 11, 2025

CID విచారణకు హాజరైన జోగి రమేశ్

image

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. 2021లో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి వచ్చారు. దాడి వెనుక ఎవరు ఉన్నారు? ఎవరెవరు వెళ్లారు? వంటి వివరాలను సీఐడీ అధికారులు రాబట్టనున్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాలని సీఐడీ ఇటీవల రమేశ్‌కు నోటీసులు ఇచ్చింది. తొలుత తాడేపల్లి పీఎస్‌లో నమోదైన ఈ కేసును కూటమి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

Similar News

News December 18, 2025

ధనుర్మాసం: మూడోరోజు కీర్తన

image

‘బలి చక్రవర్తి నుంచి 3 అడుగులు దానం పొందిన వామనుడు ఆకాశమంత పెరిగి 3 లోకాలను పాలించాడు. ఆ మూర్తి దివ్య చరణాలు స్మరించి, నామగానం చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయి. భక్తితో ఆచరిస్తే నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి. గోవులకు గ్రాసం లభిస్తుంది. పంటలు సమృద్ధిగా పండి దేశం సుభిక్షంగా ఉంటుంది. లోకానికి మంచి చేసే ఈ వ్రతాన్ని చేద్దాం’ అని గోదాదేవి తన సఖులను ఆహ్వానిస్తోంది. <<-se>>#DHANURMASAM<<>>

News December 18, 2025

టుడే హెడ్‌లైన్స్

image

✥ AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు: చంద్రబాబు
✥ ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల
✥ TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌‌దే డామినేషన్.. 2వేలకు పైగా స్థానాలు కైవసం
✥ ఐదుగురు MLAల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
✥ ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు: KTR
✥ దట్టమైన పొగమంచుతో భారత్-సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దు

News December 18, 2025

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్.. భారత్‌పై అక్కసు

image

బంగ్లాదేశ్ అవకాశం చిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతోంది. కొన్ని రోజుల క్రితం ఢాకా వర్సిటీలో PM మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనను దూషించారు. ఈశాన్య రాష్ట్రాలను(7 సిస్టర్స్) తమ దేశంలో కలిపేస్తామంటూ ఇద్దరు టాప్ స్టూడెంట్ లీడర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. ఇవాళ ఢాకాలోని భారత ఎంబసీ వద్ద ఆందోళనకు దిగారు. యూనుస్ బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి ఈ ధోరణి కనబడుతోంది.