News August 9, 2024
ఆ హీరోలపై జాన్ అబ్రహం ఫైర్

కొంత మంది ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూనే పాన్ మసాలా బ్రాండ్లను ప్రోత్సహిస్తున్నారంటూ పలువురు నటులను ఉద్దేశించి బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం వ్యాఖ్యానించారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను నా జీవితాన్ని నిజాయితీతో జీవిస్తే, నేను చెప్పేది ప్రతీది ఆచరిస్తే, అప్పుడు నేనో రోల్ మోడల్. ఏదేమైనా నేను పబ్లిక్‌లోనూ నటిస్తూ చావును అమ్మబోను’ అని చెప్పాడు.
Similar News
News December 16, 2025
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ‘NO ఫ్యూయల్’

పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వెహికల్స్‌కు ఫ్యూయల్ నింపొద్దని పెట్రోల్ పంపులకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు గురువారం నుంచి అమలులోకి వస్తాయన్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం దారుణంగా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ నడుపుతున్న వారికి SEPలో విధించిన చలాన్లలో 17% PUC సర్టిఫికెట్ లేనివి కాగా OCTలో 23%కి పెరిగాయి.
News December 16, 2025
వచ్చే నెలలో భోగాపురంలో ట్రయల్ రన్: రామ్మోహన్ నాయుడు

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును వచ్చే ఏడాది మే నాటికి ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో GMR-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఒప్పంద కార్యక్రమంలో లోకేశ్, రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రతి ఏటా ఏవియేషన్ రంగం 12% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని వివరించారు.
News December 16, 2025
నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.


