News March 16, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అభ్యర్థులు

image

➢కురుపాం- పుష్ప శ్రీవాణి
➢పార్వతీపురం- అలజంగి జోగారావు
➢సాలూరు- పీడిక రాజన్న దొర
➢బొబ్బిలి- శంబంగి వెంటక చిన అప్పలనాయుడు
➢చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
➢గజపతినగరం- అప్పలనర్సయ్య
➢నెల్లిమర్ల- బడ్డుకొండ అప్పలనాయుడు
➢విజయనగరం- వీరభద్రస్వామి కోలగట్ల
➢శృంగవరపుకోట- కడుబండి శ్రీనివాసరావు

Similar News

News October 6, 2024

18 ఏళ్లపాటు రూ.49 వేల కోట్లు అక్రమంగా వసూలు!

image

అధిక రాబ‌డులు ఆశ‌చూపి రూ.వేల కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్న ఆరోపణలపై పెర‌ల్ ఆగ్రో కార్పొరేష‌న్ లిమిటెడ్ పై ఈడీ విచారణ జరుపుతోంది. 18 ఏళ్ల‌పాటు దేశవ్యాప్తంగా 5.8 కోట్ల‌ మంది నుంచి సదరు సంస్థ ఏకంగా రూ.49 వేల కోట్లు వ‌సూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 44 చోట్ల సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.

News October 6, 2024

ఈ పండును తిన్నారా?

image

విదేశాల నుంచి మనకు పరిచయమైన పండ్లలో రాంబూటన్ పండు ఒకటి. పైన ఎర్రగా ముళ్లలాగా, లోపల కండ భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు తీపి, పుల్లటి రుచులు కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మరి ఈ పండును మీరు తిన్నారా? కామెంట్ చేయండి.

News October 6, 2024

ప్రకాశ్ రాజ్‌కు నిర్మాత కౌంటర్

image

TN డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో కూర్చున్న ఫొటో షేర్ చేసిన ప్రకాశ్ రాజ్‌కు తమిళ నిర్మాత వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘మీతో ఉన్న ముగ్గురు ఎన్నికల్లో గెలిస్తే, మీరు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అది మీ మధ్య తేడా. ఎలాంటి కారణం చెప్పకుండా మీరు షూటింగ్ నుంచి వెళ్లడంతో నాకు రూ.కోటి నష్టం వచ్చింది. కాల్ చేస్తానని ఇంతవరకు చేయలేదు’ అని ట్వీట్ చేశారు. ఈయన ప్రకాశ్ రాజ్‌తో ‘ఎనిమీ’ మూవీ తీశారు.