News November 6, 2024
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా జోస్ ఇంగ్లిస్
ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్‌ను సీఏ నియమించింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ గైర్హాజరీ నేపథ్యంలో ఆయన సారథ్య బాధ్యతలు అందుకున్నారు. అలాగే కమిన్స్, స్మిత్, హేజిల్‌వుడ్‌కు రెస్ట్ ఇవ్వడంతో పాక్‌తో జరగబోయే మూడో వన్డేకు కూడా ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కాగా ఇంగ్లిస్ ఇప్పటివరకు 26 అంతర్జాతీయ టీ20లే ఆడారు. 100 మ్యాచులు ఆడిన సీనియర్లను కాదని ఆయనను సారథిగా నియమించారు.
Similar News
News December 10, 2024
తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి
ప్రోకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ దారుణంగా ఓడిపోయింది. హరియాణా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచులో 46-25 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. TTలో ఆశిష్ నర్వాల్ సూపర్ 10 సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
News December 10, 2024
కాలుష్యాన్ని నియంత్రించే బ్యాక్టీరియా.. IIT గువాహటి శాస్త్రవేత్తల ఆవిష్కరణ
బ్యాక్టీరియా ద్వారా మీథేన్, కార్బన్ డయాక్సైడ్‌ను శుద్ధమైన బయోఫ్యూయల్‌గా మార్చే విధానాన్ని IIT గువాహటి శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. Prof.దేవాశిష్, కళ్యాణి సాహు బృందం ఆవిష్కరించిన ఈ విధానం ద్వారా మెథానోట్రోఫిక్ బ్యాక్టీరియా కాలుష్య కారకాలను శుద్ధిచేస్తుంది. ప్రయోగ దశలో ఉన్న ఈ నమూనా ప్రస్తుతం 5L పరిమాణంలో ఉంది. పర్యావరణ అనుకూల ఇంధన ఆవిష్కరణలో ఇది కీలక ముందడుగని వారు పేర్కొన్నారు.
News December 9, 2024
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ఎప్పటి నుంచంటే?
AP: రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు TDP MLA యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు.