News June 5, 2024

చంద్రబాబు మాటలతో స్టాక్ మార్కెట్లో జోష్

image

‘మేం NDAతోనే ఉంటాం’ అన్న చంద్రబాబు మాటలు స్టాక్ మార్కెట్లో జోష్ పెంచాయి. మరోసారి బలమైన మోదీ ప్రభుత్వాన్ని చాలామంది ఆశించారు. అంచనాలు తప్పి BJPకి 240 సీట్లే రావడం, బాబు, నితీశ్‌పై సందేహాలతో మార్కెట్లు క్రాష్ అయ్యాయి. నేటి ఉదయం ప్రెస్‌మీట్లో NDAకు చంద్రబాబు జైకొట్టడంతో పాజిటివ్ సెంటిమెంటుతో సూచీలు పెరిగాయని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాశ్ గోరక్షకర్ అన్నారు. దీనిపై మీ స్పందనేంటి?

Similar News

News October 29, 2025

నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌లో ఉండేలా చర్యలు: మంత్రి అనగాని

image

AP: గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజనలోని లోపాలను సవరించడంపై క్యాబినెట్ సబ్‌ కమిటీ ఇవాళ చర్చించింది. CM ఆదేశాలు, మంత్రులు ఇచ్చిన సూచనలను పరిశీలించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మండల, పంచాయతీలను విభజించకుండా నియోజకవర్గమంతటినీ ఒకే డివిజన్‌లో ఉంచాలని నిర్ణయించామన్నారు. కాగా కేంద్రం చేపట్టే జనగణనకు ముందే విభజనపై నివేదికను అందిస్తామని మంత్రి మనోహర్ తెలిపారు.

News October 29, 2025

ఇక స్పామ్ కాల్స్‌‌కు చెక్.. TRAI నిర్ణయం!

image

ఇన్‌కమింగ్ కాల్స్‌ విషయంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. కాలర్ పేరు రిసీవర్ ఫోన్‌లో ఇకపై డిఫాల్ట్‌గా డిస్‌ప్లే కానుంది. ఈ మేరకు టెలికం శాఖ ప్రపోజల్‌కు TRAI ఆమోదం తెలిపింది. SIM తీసుకునేటప్పుడు ఇచ్చిన వివరాలను ‘కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్’ ఫీచర్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇది అందుబాటులోకొస్తే TrueCaller వంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండదు. స్పామ్ కాల్స్‌ను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుందని TRAI చెప్పింది.

News October 29, 2025

భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

TG: మొంథా తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. అటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో సెలవు ఇవ్వాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.