News June 5, 2024
చంద్రబాబు మాటలతో స్టాక్ మార్కెట్లో జోష్
‘మేం NDAతోనే ఉంటాం’ అన్న చంద్రబాబు మాటలు స్టాక్ మార్కెట్లో జోష్ పెంచాయి. మరోసారి బలమైన మోదీ ప్రభుత్వాన్ని చాలామంది ఆశించారు. అంచనాలు తప్పి BJPకి 240 సీట్లే రావడం, బాబు, నితీశ్‌పై సందేహాలతో మార్కెట్లు క్రాష్ అయ్యాయి. నేటి ఉదయం ప్రెస్‌మీట్లో NDAకు చంద్రబాబు జైకొట్టడంతో పాజిటివ్ సెంటిమెంటుతో సూచీలు పెరిగాయని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాశ్ గోరక్షకర్ అన్నారు. దీనిపై మీ స్పందనేంటి?
Similar News
News December 10, 2024
శబరిమల వెళ్లే మహిళలకు గుడ్‌న్యూస్
శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించింది. అయ్యప్ప మాలధారులతో వచ్చే మహిళలు తమవారు తిరిగొచ్చే వరకు పంపా బేస్, హిల్ టాప్ వద్ద వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో మహిళలకు ఆ కష్టాలు తీరనున్నాయి.
News December 10, 2024
మీడియా సంస్థలపై జగన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా
AP: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తనపై అవాస్తవాలు ప్రచురించాయంటూ పలు మీడియా సంస్థలపై రూ.100 కోట్లకు మాజీ సీఎం జగన్ పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
News December 10, 2024
మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్
AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.