News September 20, 2024

మాతృత్వంతో ఆనందం, ఆందోళన: అలియా భట్

image

తల్లి అయిన తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్ సాధ్యం కావట్లేదని హీరోయిన్ అలియా భట్ చెప్పారు. తనకంటూ సమయం వెచ్చించలేకపోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మాతృత్వం ఆనందంగానే ఉన్నా ఆందోళన కూడా ఉందన్నారు. కూతురు రాహా అల్లరి, చిలిపి పిల్ల అని మురిసిపోయారు. 2022 నవంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 11న ఇది విడుదల కానుంది.

Similar News

News February 8, 2026

మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు: భట్టి

image

TG: త్వరలో మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం 4.50 లక్షల గృహాలు నిర్మించామని చెప్పారు. స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు, లేని వారికి జీ+2 తరహాలో నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని అన్నారు.

News February 8, 2026

తలకు నూనె ఎప్పుడు రాయాలంటే?

image

తలస్నానం చేయడానికి కనీసం ఒక గంట/ రెండు గంటల ముందు నూనె రాయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు తగిన పోషణ అంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు బాగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా పొడి జుట్టు, నిర్జీవమైన జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారానికి రెండుసార్లు నూనె రాస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. రాత్రిళ్లు నూనె రాయకూడదని చెబుతున్నారు.

News February 8, 2026

నేడు ఈ పనులు చేయకండి!

image

ఈరోజు భాను సప్తమి. ఆదిత్యుడిని పూజించే పవిత్రమైన రోజు! ఇంతటి శుభదినానికి గౌరవమిస్తూ కొన్ని నియమాలు పాటించడం మంచిది. ‘మద్యానికి దూరంగా ఉండాలి. మాంసం ముట్టరాదు. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు. ఉల్లి, వెల్లుల్లి తినరాదు. బ్రహ్మచర్యం పాటించాలి’ అని సూర్యాష్టకంలో ఉంది. లేకపోతే 7 జన్మల పాటు రోగాలు, దరిద్రంతో బాధ పడతారని పండితులు చెబుతున్నారు. శుభ ఫలితాలకై నేడు ఏం చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.