News April 27, 2024

ఎల్లుండి రాష్ట్రానికి జేపీ నడ్డా

image

TG: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 29న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగూడెం, మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారు. 30న ప్రధాని మోదీ అల్లాదుర్గ్ సభ, 3న వరంగల్, నల్గొండ, 4న మహబూబ్‌నగర్, వికారాబాద్ సభల్లో పాల్గొంటారు. మే 1న హోంమంత్రి అమిత్ షా చార్మినార్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Similar News

News April 15, 2026

GNT: దొరకని రిమాండ్ ఖైదీ ఆచూకీ

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌) నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ పరారయ్యాడు. అనారోగ్య కారణాలతో రేపల్లె సబ్ జైలు నుంచి చికిత్స కోసం వచ్చిన ఇతడు, మూత్ర విసర్జన సాకుతో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఏలూరుకు చెందిన అజిత్‌పై గతంలో చీటింగ్ కేసులు ఉన్నాయి. ఎస్కార్ట్ ఉండగానే ఖైదీ చెక్కేయడం పోలీసులకు సవాల్‌గా మారింది.

News April 15, 2026

బీట్‌రూట్‌తో హెల్తీ హెయిర్

image

అందంగా, ఆరోగ్యంగా ఉండే హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి బీట్‌రూట్ పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లోని జిడ్డు, చుండ్రు తగ్గుతాయి. దీంట్లోని ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడు రక్తప్రసరణను పెంచి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు.

News April 15, 2026

యుద్ధం వేళ డిజిటల్ బంగారంపై పెరిగిన నమ్మకం!

image

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న వేళ ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. స్టాక్ మార్కెట్ల ఊగిసలాటల మధ్య రిస్క్ లేని పెట్టుబడి కోసం గోల్డ్ ETFలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది తొలి 3 నెలల్లో ఏకంగా ₹31,561 కోట్లు ఈ ఫండ్లలోకి చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 6రెట్లు పెరగడం గమనిస్తే.. ఇన్వెస్టర్లు భౌతిక బంగారం కంటే డిజిటల్ పసిడి వైపే అట్రాక్ట్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది.