News October 8, 2024
BJP సెక్రటరీలతో సమావేశం కానున్న జేపీ నడ్డా

హరియాణా, జమ్మూకశ్మీర్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ జనరల్ సెక్రటరీలతో కాసేపట్లో సమావేశం అవుతారని తెలిసింది. EC ప్రకారం ప్రస్తుతం హరియాణాలో బీజేపీ ఆధిక్యాలు మ్యాజిక్ ఫిగర్ 46ను దాటేశాయి. ఒకవేళ ఇవి మారితే ఏం చేయాలన్న దానిపై చర్చిస్తారని సమాచారం. JKలో ఎలాంటి వ్యూహం అనుసరించాలో ఆలోచిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News December 6, 2025
తమిళనాడులో ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెందినవారిగా గుర్తించారు.
News December 6, 2025
చలికాలంలో ఉదయాన్నే వాకింగ్‌తో నష్టాలే ఎక్కువ!

వాకింగ్ శరీరానికి ఎంతో మంచిది. కానీ చలికాలం ఉదయాన్నే చేసే వాకింగ్‌తో లాభంకంటే నష్టాలే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. ‘చల్లటి గాలి ఊపిరితిత్తులపై ఒత్తిడి తెస్తుంది. BP పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. సడెన్‌గా చలిలోకి వెళ్లడంతో ఇమ్యూనిటీ ప్రభావం పడుతుంది. దాంతో తరచూ జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. మంచులో రోడ్డు సరిగ్గా కనిపించక పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది’ అని హెచ్చరిస్తున్నారు.
News December 6, 2025
కోళ్లలో కొక్కెర వ్యాధి.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టం

కొళ్లలో కొక్కెర వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది అన్ని వయసుల కోళ్లకూ సోకుతుంది. దీన్ని రాణిఖేత్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన కోళ్లలో 80-90% చనిపోతాయి. ఇది సోకిన కోడి ముక్కు నుంచి కారే ద్రవాల వల్ల, వ్యాధి క్రిములు చేరిన మేత, నీరు, గాలి ద్వారా ఇతర కోళ్లకూ వ్యాపిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఫారమ్‌లోని కోళ్లన్నీ మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు, నివారణ సూచనలకు <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


