News April 3, 2024

రేప్ బాధితురాలిని బట్టలు విప్పమన్న జడ్జి

image

రేప్ కేసు బాధితురాలి గాయాలు చూసేందుకు బట్టలు విప్పమని మెజిస్ట్రేట్ ఆదేశించిన ఘటన రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. గత నెల 19న తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి బట్టలు విప్పి గాయాలు చూపించాలని ఆదేశించారు. నిరాకరించిన ఆ యువతి జడ్జిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Similar News

News April 21, 2025

కొత్త పోప్‌ను ఎలా ఎన్నుకుంటారంటే? 1/2

image

పోప్ ఫ్రాన్సిస్ <<16168572>>కన్నుమూయడంతో<<>> 20 రోజుల తర్వాత నూతన క్రైస్తవ మతగురువును ఎన్నుకోనున్నారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ చర్చిల సీనియర్లు(వారిని కార్డినల్స్ అని పిలుస్తారు) వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్ భవనానికి వెళ్తారు. ఎన్నిక సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్, రేడియో, న్యూస్‌పేపర్ల వంటివేవీ అందుబాటులో ఉంచరు.

News April 21, 2025

కొత్త పోప్‌ను ఎలా ఎన్నుకుంటారంటే? 2/2

image

ఎవరు పోప్ కావాలనుకుంటున్నారో కార్డినల్స్ పేపర్లో రాసి బ్యాలెట్‌లో వేస్తారు. స్పష్టమైన మెజార్టీ రాకపోతే వాటిని కాల్చడం ద్వారా వచ్చే నల్లటి పొగ చిమ్నీ ద్వారా బయటికి వెలువడుతుంది. ఇది ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదనేందుకు సంకేతం. మళ్లీ ఓటింగ్ జరుగుతుంది. 2/3 మెజార్టీ వచ్చినవారు పోప్‌గా ఎన్నికవుతారు. ఓ కెమికల్‌ కలిపి, ఆ బ్యాలెట్ పత్రాలను కాల్చేస్తారు. అలా వెలువడే తెల్లటి పొగ కొత్త పోప్ ఎన్నికకు చిహ్నం.

News April 21, 2025

ప్రపంచంలో అతిపెద్ద పెట్రోల్ బంక్ ఇదే!

image

మన దగ్గర ఉండే పెట్రోల్ బంకుల్లో మహా అంటే 10 వరకు ఫిల్లింగ్ స్పాట్స్ ఉంటాయి. కానీ, ఒకేసారి 120 కార్లకు పెట్రోల్ ఫిల్ చేయగలిగే సామర్థ్యంతో బంక్ ఉందనే విషయం మీకు తెలుసా? అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు సమీపంలో ‘Buc-ee’s’ అనే బంక్ ఉంది. ఇది 75,000 చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉండగా ఇందులో ఫుడ్ & షాపింగ్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.

error: Content is protected !!