News July 12, 2024

కవిత బెయిల్‌పై 22న తీర్పు

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 22న వెల్లడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కాగా కవితపై ఛార్జిషీట్ లోపభూయిష్టంగా ఉందని ఆమె తరఫు లాయర్లు వాదించారు. డిఫెక్టివ్ ఛార్జిషీట్ ఉన్నప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని వారు పేర్కొన్నారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ కోర్టుకు నివేదించింది.

Similar News

News October 16, 2025

PHOTO GALLERY: శ్రీశైలంలో PM మోదీ

image

AP: ప్రధాని మోదీ శ్రీశైల మల్లన్న సేవలో తరించారు. సంప్రదాయ దుస్తులు ధరించి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. శ్రీశైల ఆలయంలో మోదీ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News October 16, 2025

రబీ పంటగా ఉలవల సాగు- అనువైన రకాలు

image

ఉలవలను సాధారణంగా లేట్ ఖరీఫ్/రబీకి ముందు, రబీలో పండించవచ్చు. వీటిని నీటి లభ్యతను బట్టి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. P.D.M-1, P.Z.M-1, P.H.G-62 రకాలు సాగుకు అనుకూలం. సాళ్ల పద్ధతిలో గొర్రుతో విత్తేటప్పుడు ఎకరాకు 8-10 కిలోలు, వెదజల్లి దున్నే పద్ధతిలో ఎకరానికి 12-15 కిలోల విత్తనం అవసరం. ప్రతి కిలో విత్తనాన్ని కార్బండిజమ్ 1గ్రా. లేదా థైరమ్‌ 3గ్రా.తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

News October 16, 2025

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి: APSDMA

image

AP: దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని APSDMA తెలిపింది. దేశంలోకి మే 24న, రాష్ట్రంలోకి మే 26న ఈ రుతుపవనాలు ప్రవేశించినట్లు వివరించింది. అటు ఇవాళ దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవుతాయని ఐఎండీ పేర్కొంది. దీంతో ఇవాళ ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.